నిజమైన నాయకుడు అంటే జనం నుంచి పుట్టేవాడు.. వర్గాలు, కులాలు, గ్రూపులు, రాజకీయాలు.. ఇవన్నీ కలిమిలేముల తారతమ్యం నుంచి పుట్టుకొచ్చినవే. ఉన్నోడు లేనోళ్లను దోచుకోవడం, లేనోడు కడుపుమండి తిరుగుబాటు చేయడం ఆ తిరుగుబాటు గ్రూపులే రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందడం. కేంద్ర పాలకల ముందు మోకరిళ్లాల్సిన స్థితిలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బాధిత, పీడిత, బడుగు బలహీన వర్గాల కడుపు మండి వారి ఆక్రందన నుంచి పార్టీ పుట్టిందంటూ ఎవరి అండా లేకుండానే నాడు ఎన్టీఆర్ జన నేతగా ప్రభంజనం సృష్టించారు.
మనకు తెలిసినంత వరకు మరో జన నేతగా ఎదిగిన నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగా చెప్పుకోవచ్చు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి దాదాపు 30 ఏళ్ల రాజకీయ ప్రజా జీవితం తరువాత మహాపాదయాత్రతో ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగారు. ప్రజా మన్ననలు పొందే పాలనను సాగించి కోట్లాది ప్రజల గుండెల్లో జన నేతగా నేటికీ వెలుగొందుతూనే ఉన్నారు. ఆయన తనువు చాలించి ఎన్నేళ్లయినా ప్రజలు ఆయన్ను మరిచిపోలేక పోతున్నారంటే ఆయన ప్రజల గుండెల్లో ఏ స్థాయిలో నిలిచిపోయారో చెప్పుకోవచ్చు.
కాని నేటి రాజకీయాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం ప్రధానంగా ప్రజల్లో హవా కొనసాగిస్తున్న పార్టీ నేతలను పరిశీలిస్తే.. ఎవరు నిజమైన జననేత అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్న మాట.
ఏపీలో ధీటైన ప్రతిపక్షంగా 70కి పైగా ఎమ్మెల్యేలతో ప్రస్థానాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మంచి ఖలేజా.. కసిగల నాయకుడు. నమ్మిన వారికి ప్రాణం ఇవ్వడం ఆయన నైజం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తండ్రి బాటలో నడుస్తుండటం గమనార్హం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తరువాత అంతలా ప్రజల్లో నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి వైఎస్ జగన్. వైఎస్ జగన్ నిలకడగల రాజకీయాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రతో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు.
ఇక చంద్రబాబు చరిత్రను పరిశీలిస్తే .. జననేతగా చంద్రబాబు ప్రస్థానం ప్రారంభమైనట్లు చరిత్రే లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మామచాటు నేతగా.. సలహాదారుగా ఉన్న ఆయన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగారన్న అపవాడు ఇప్పటికీ పోలేదు.
మరో పక్క అన్నకు తోడుగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన పవన్ కల్యాణ్ అనుభవ రాహిత్యం అపజయాన్నే మిగిల్చింది. సమాజానికి ఏదో చేయాలని చేసిన ప్రసంగాలు అందర్నీ ఆకట్టుకున్నా పార్టీపై కోవర్టు ప్రచారం కొంప ముంచింది. తన అన్న స్థాపించిన ప్రజారాస్యం నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్న పవన్.. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. ఆ తరువాత రాజకీయ అధ్యయనం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం మళ్లీ రాజకీయ జీవితంలోకి వచ్చారు పవన్ కల్యాణ్. వచ్చీ రాగానే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై తన పోరాటం నిరంతరం సాగుతుందని ప్రకటించిన పవన్ కల్యాణ్.. అధికార పార్టీలను నిలదీయడంలో విఫలమయ్యారు. ప్రజా వ్యతిరేక రాజకీయాల లెక్క తేలుస్తానంటూ పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్‌కు ఈ పవనుడి గాలి ఎటు వీస్తుందో..
2019 ఎన్నికల్లో ఈ పమూడు పార్టీల మధ్యే ప్రధాన పోరు జరుగుతున్న సాగుతున్నందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మూడు పార్టీల అధినేతల్లో జన నేత ఎవరు అన్నది మీరే తేల్చండి..!!