వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. వై ఎస్ జగన్ కాళ్లతో కాదు కదా..! మోకాళ్లపై నడిచినా కూడా ఈ జన్మలో సీఎం కాలేడని, టీడీపీపై ఆరోపణలు తప్ప జగన్‌కు వేరే పని లేదన్నారు. తమ ప్రభుత్వంలో 250 జనాభా ఉన్న ప్రతీ గ్రామానికి తారు రోడ్లు వేయించామన్నారు. కిడ్నీ వ్యాధుల గ్రామాలకు మార్చి 31నాటికి సుజల స్రవంతి నీరు అందిస్తామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు.
