ఇవాళ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయదుందిబి మోగించింది.వివరాల్లోకి వెళ్తే..కొత్తగూడెం నియోజక వర్గంలోని సుజాత నగర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 1126 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలిచింది. ఇక.. అశ్వారావుపేట నియోజక వర్గం అన్నపురెడ్డిపల్లి పంచాయతీలో 381 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కీసరి చిట్టెమ్మ ఘన విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం గుండంరాజుపల్లి సర్పంచ్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థి లలిత 106 ఓట్లతో విజయం సాధించింది. చిన్నగూడూరు 8వ వార్డుకు టీఆర్‌ఎస్ అభ్యర్థి కుమ్ము ఎల్లమ్మ గెలిచింది. అదే జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో జరిగిన సర్పంచ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చారిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవరకొండ శ్రీనివాస్ 326 ఓట్లతో గెలిచాడు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు స్వీట్లు పంపిణి చేసి ఆనందం వ్యక్తం చేశారు.
