వరిసాగు చేసే రైతులు సోమరిపోతులట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. ఏకంగా మంత్రి హోదాలో ఉన్న దేవినేని ఉమా. ఇక అసలు విషయానికొస్తే.. ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా రైతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన వ్యవసాయ పంటల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట వేశారు.ఆ పంటను పండించకుండా వేరే పంటపై రైతులు ద్రుష్టి పెట్టాలని కీలక వాఖ్యలు చేశారు.అయితే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువమంది రైతులు వరి పంటపై ఆధారపడి వారి జీవనం కొనసాగిస్తుంటారు.అలాంటి వరి పంటపై మంత్రి ఇలాంటి వాఖ్యలు చేయడంవలన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారి తీస్తుంది.
