వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర నేటికి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద 74వ రోజుకి 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో 75వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది.
మంగళవారం ఉదయం ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సిద్ధయ్యకోన, పొక్కనదాల క్రాస్, ఊటకూరు, గిద్దలూరు క్రాస్, తురిమెళ్ల, కలిచేడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తురిమెళ్లలో పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అలాగే కలిచేడులో చేనేతలతో ముఖాముఖి అవుతారు. వైఎస్ జగన్ రాత్రికి కలిచేడులోనే బస చేస్తారు.