‘ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జనసేనా అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పై వివాదస్పదామైన వాఖ్యలు చేశారు. టాలీవుడ్ సినిమా ఫీల్డులో 2 లక్షలకు పైగా టెక్నీషియన్స్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మనుషులు ఎందరో ఉన్నారు. చిత్రపురి కాలనీలో, కృష్ణా నగర్లో అవకాశాలు లేక తిండి తిప్పలు లేక చస్తున్నారు. ప్రశ్నించడానికి జనసేన పార్టీ పెట్టినపుడు మా ఇండస్ట్రీలో ఉండే సమస్యలు ప్రశ్నించడానికి కనిపించడం లేదా? చిన్న సినిమాల నిర్మాతలు థియేటర్లు దొరకక, రెంట్లు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివి ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ కు చేతకాడం లేదా? ఆయనకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. సినిమా పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎంతో మంది నాశనం అయిపోతున్నారు. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో 2వేల థియేటర్లు ఉండేవి. ఈ రోజు 1400 థియేటర్లు మిగిలాయి. ఆ థియేటర్లు కూడా అగ్ర నిర్మాతల చేతుల్లో ఉన్నాయి. దీంతో చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. ఇలాంటివి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇది ఆయనకు కనిపించడం లేదా? అంటూ….. అజయ్ కౌండిన్య ఫైర్ అయ్యారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ మొన్న చంద్రబాబు, మోడీ వెంట తిరిగారు. ఇపుడేమో తెలుగు రాష్ట్రాల్లో సొంతగా పోటీ చేస్తా అంటున్నాడు. మా సినిమా ఫీల్డుకు న్యాయం చేయని పవన్ కళ్యాణ్ ప్రపంచానికి ఏం న్యాయం చేస్తాడు?…. అని కౌండిన్య ప్రశ్నించారు.
పవన్ ఫ్యాన్స్ పై…
ఈ సమస్య మా సినిమా ఫీల్డుకు సంబంధించిన సమస్య. ఈ సమస్య గురించి మీరెవరైనా తప్పుగా ఆలోచించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఐయామ్ సోలో…. నన్నెవ్వడేం పీకలేడు. ఎవరైనా మాట్లాడితే గుడ్డలిప్పదీసి గొడ్డుకారం వేసి కొడతాను. డైరెక్టర్ అనేవాడు ఉంటేనే హీరో ఉంటాడు. మేము ఆయనకు పని చేస్తున్నాం. మా సమస్యల గురించి మేము మాట్లాడుతున్నాం.అని కౌండిన్య అన్నారు.
