తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లలో శ్రీనివాస్ హత్య ఘటన మరువకముందే మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ వెనకాల బొట్టుగూడ జెండా గద్దెపై కనగల్ మండల కేంద్రానికి చెందిన పాలకూరి రమేశ్‌గౌడ్ తల నరికి పెట్టారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొండెం మాత్రం దొరకలేదు. మొండెం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.