సినిమా ఇండస్ట్రీ లో రాంగోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం.. వర్మ తీసే సినిమాలు గాని, వీడియోలు గాని ఎన్నో వివాదాలకు తెరలేపుతాయి.. అసలు తాను తీసే సినిమాలో దమ్ముకంటే వివాదంతోనే వర్మ ఎక్కువగా క్యాష్ చేసుకుంటాడని అనేవారూ లేకపోలేదు. పబ్లిసిటీ వస్తుందంటే ఎంతకయినా దిగజారి మాట్లాడగలిగిన వ్యక్తి ఆయన..మరి అలాంటి రాంగోపాల్ వర్మ తాజాగా సెన్షేషనల్ షార్ట్ ఫిల్మ్ గాడ్ సెక్స్ ట్రూత్ అనేది యూత్‌లో విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకుంది.అయితే దీనిపై వర్మ ఫ్యాన్స్ ఇప్పుడు కొత్త పోలిక తెచ్చారు. ఈ దర్శకుడు తీసిన గాడ్ సెక్స్ ట్రూత్ సినిమా ను తిట్టేవాళ్లు తిడుతుండగా.. పొగిడేవాళ్లు మాత్రం పొగిడేస్తున్నారు. మరోవైపు దీనిపై పోలీసు కంప్లైంట్లు, విమర్శలకూ లోటు లేదు.
ఈ రచ్చకు మరింత ఆజ్యం పోస్తూ.. కొంతమంది వర్మ ఫ్యాన్స్ కొత్త రకం కామెంట్లు, ట్వీట్లు పెడుతున్నారు. ఇందులో భాగంగా ‘జీఎస్టీ’లో మియా మాల్కోవా పోజును.. ‘బాహుబలి-2’లో రమ్యకృష్ణతో సింహాసనంపై కూర్చునే పోజుతో పోల్చారొకరు. ఈ మేరకు ఒక ట్వీట్ ఇంటర్నెట్ లో దర్శనమిస్తోంది. దాన్ని వర్మ కూడా రీట్వీట్ చేసేశాడు. ‘జీఎస్టీలో మియా మాల్కోవా కూర్చున్న పోజు బాహుబలిలో రమ్యకృష్ణ కూర్చు పోజు కంటే గొప్పగా ఉంది’ అని ఒక ట్వీట్ పోస్టు అయ్యింది. ‘అద్భుతమైన పోలిక..’ అంటూ దాన్ని రీట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ.