తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ప్రజా సేవే ధ్యేయంగా 2011 ఏప్రిల్ 19 న ప్రారంబించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలను నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి,స్వచ్చంద కార్యక్రమాలు చేపడుతూ ..తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు నిత్యం ప్రజాసేవ చేస్తూ మంథని నియోజకవర్గంలో దుకుకుపోతున్న తెలంగాణ ఉద్యమకారుడు,మంథని ఎమ్మెల్యే పుట్ట మధు.. వచ్చే మార్చి నెలలో 200 సాముహిక వివాహాలు జరిపించి ఇప్పటివరకు మంథని నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయనివిధంగా చేసి చరిత్ర సృష్టించబోతున్నాడు.కాగా మొదటగా ఉచిత నీటి సరఫరా తో ప్రారంభమైన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు నేడు నియోజకవర్గంలోని నిరుపేదలను అక్కున చేర్చుకొని నేనున్నా అంటూ బాసటగా నిలిచే ఒక మంచి సంస్థగా మార్చారు.వేసవికాలంలో ప్రజల దాహార్తి తీ ర్చడానికి అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సాధారణంగా మన ఇంట్లో ఏమైనా ఆపద వస్తే మనకు ఇంటిపెద్ద గుర్తొస్తాడు.అదే మంథని నియోజకవర్గంలో ఏవరికి ఏ ఆపద వచ్చిన పుట్ట మదే గుర్తుకు వస్తాడు అంటే అతిశయోక్తి కాదు.
ఒక వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పేదలకు కళ్యాణ లక్ష్మి ,షాదీముభారాక్ లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ యువతుల పెళ్ళిళ్ళకు రూ.75,116 వేలు ఆర్ధిక సహాయం అందిస్తుంటే.. ఎమ్మెల్యే పుట్ట మధు.. పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వార అనాధ యువతులకు అదనంగా తనవంతుగా పుస్తె మట్టెలు అందించి బాసటగా నిలుస్తున్నారు.ఇప్పటివరకు 62 మందికి పుస్తె మట్టెలు ట్రస్ట్ ద్వార అందించి ఇతోధికంగా కోరినవారికి తనవంతుగా ఆర్ధిక సహాయం అందజేసాడు.
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దళిత కాలనీల్లో విద్యుత్ మీటర్లు లేక దొంగచాటుగా కరెంట్ తీగలు తగిలించికుంటూ కరేంటో ళ్లు రాగానే వాటిని తొలగించాలంటూ అవమానాల పాలవుతున్న దళితుల ఆత్మగౌరవం నిలబడేలా తన స్వంత ఖర్చులతో 15వేల మందికి ఉచిత విద్యుత్ మీటర్లు అందించి బాసటగా నిలిచారు.
మంథని నియోజకవర్గం అంటేనే మొత్తం అటవీ ప్రాంతం.అలాంటి అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల నుండి అత్యవసర వైద్య సౌకర్యం కోసం పట్టణాలకు రోగులను తరలించడానికి ట్రస్ట్ ద్వార ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని శాసనసభాపతి మధుసుధనచారి చేతులమీదుగా 2016 ఏప్రిల్ 19న ప్రారంబించి.. మంథని , ముత్తారం ,కాటారం ,మల్హర్ మండలాల్లో అంబులెన్స్ లు ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం చిన్న ఓదాల ,వెంకటాపూర్ ,విలోచవరం,మంథని పోచామ్మవాడలతో పాటు సెంటినరీ కాలనీ జేఎన్టీయూ కళాశాల వద్ద బస్ షెల్టర్ ల నిర్మాణం చేపట్టారు.అంతేకాకుండా బస్టాండ్ లలలో ఫ్యాన్లను ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 168 బెంచీలు ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలోని దాదాపు వందమందికి పైగా వికలాంగులకు 56 ట్రై సైకిల్లు, పంపిణీ చేయగా పదిమందికి కృత్రిమ కళ్ళు అందజేసి తన మానవత్వం చాటుకున్నారు.అంతేకాకుండా ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
మంథని నియోజకవర్గంలో దాదాపు మొత్తం మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తుంటారు.ఈ సందర్బంగా నియోజకవర్గంలోని పేద విద్యార్ధులకు ఉన్నత చదువుల కోసం ఆర్ధిక సహాయం అందజేయడమే కాకుండా మొన్నటికి మొన్న ఒక విద్యార్ధికి విదేశీ చదువుల కోసం ఒక లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసి అతనికి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పోటీ పరిక్షలకు స్టడీ మెటీరియల్ ,పెన్నులు ,పరీక్షకు సంబంధించిన పలు వస్తువులు అందజేసి.. వారికి జాబ్ కోచింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తూ.. నియోజకవర్గంలోని యువతకు అండగా నిలబడ్డాడు.కాగా నియోజకవర్గంలోని 7 జూనియర్ కళాశాలలల్లో ,2 డిగ్రీ కళాశాలలల్లో ,1 ITI కళాశాల ,1 మోడల్ స్కూల్ లో ఉచితంగా మధ్యాహ్న భోజనం విద్యార్ధులకు అందజేస్తున్నాడు .
అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తమ కూరగాయలు తామే పండించుకునే విధంగా కిచెన్ గార్డెన్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి..వివిధ రకాల కూరగాయల విత్తనాలను గ్రామగ్రామాన ఉచితంగా పంపిణి చేసి వాటిని తన నియోజకవర్గంలోని ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించారు.
అలాగే నియోజకవర్గంలోని తన కార్యకర్త కుటుంబం లోని పెద్ద మరణిస్తే వారికి ఆర్ధిక సహాయం అందజేయడమే కాకుండా కుటుంబం లోని పిల్లలపై కొంతమొత్తంపైసలను బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తున్నాడు.నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న అనాథ మహిళా అయిన మంథని మండలం కన్నాల గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి భగ్యలక్ష్మి కి ట్రస్ట్ ద్వార ఇల్లు నిర్మించి గూడు కల్పించారు.
మంథని నియోజకవర్గ వ్యాప్తంగా 30పైగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి,మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు పేపర్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ అందించాడు.
అంతేకాకుండా నియోజకవర్గంలో జరిగే పెళ్ళిలల్లో ఒక గ్గిఫ్ట్ రూపంలో అమ్మయికి చీర, ఒక టవల్ అందజేస్తున్నాడు. శుభకార్యాలలో,ఆశుభకార్యలల్లో ,పుట్టుకలో,చావులో ఏ అవసరమున్న ట్రస్ట్ కు సంబంధించిన వాటర్ ట్యాంకర్ల ద్వార మంచినీరు సరఫరా చేస్తూ ఆసరాగా నిలవడంతో పాటు సేవలకు అందరికి అందుబాటులో ఉండటానికి గాను ,కాటారం,మంథని,కమాన్ పూర్ మండలాల్లో ఒక్కో వాటర్ ట్యాంకర్ ను ఏర్పాటు చేశారు.ఏ సమయంలోనైన ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ భుజం తట్టి ఆర్ధిక సహాయం అందిస్తూ నియోజకవర్గం లోని ప్రజలకు బాసటగా నిలుస్తున్నాడు.
ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కమారు వచ్చే గోదావరి పుష్కరాల నిర్వహణ తెలంగాణ రాష్ట్రంలో తొలి సారిగా టీ ఆర్ ఎస్ ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సకల సౌకర్యాలు కల్పించడంలో సక్సెస్ అయింది.ఈ క్రమంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వార త్రాగునీరు ,పులిహోర పంపిణి,మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ తో పాటు వాల౦టీర్లను నియమించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ మన్ననలే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజల మన్ననలు ఎమ్మెల్యే పుట్ట మధు పొందాడు.
అంతేకాకుండా పుట్ట లింగమ్మ ట్రస్ట్ తో ఆటలపోటీ లు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు . కాగా రాబోయే మేడారం జాతరను ద్రుష్టి లో వుంచుకొని మంథని నియోజకవర్గం నుండి మేడారం వరకు సూచిక బోర్డులను పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వార ఏర్పాటు చేశాడు.ఈ విధంగా తన ట్రస్ట్ తో మంథని ప్రజలకు మీకు నేనున్నా అంటూ వారికీ ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు.