రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆదేశాలు జారీచేసింది.రేపు జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి నేపథ్యంలో స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసి వారి త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటల నుంచి రెండు నిమిషాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మౌనం పాటించాలని ఈ సందర్బంగా స్పష్టం చేసింది. ఆ సమయంలో రహదార్లపై వాహన రాకపోకలు కూడా నిలిపివేయాలని సూచించింది.
