తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం లభించింది.ఇవాళ ఉదయం 4గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న మంత్రి కేటీఆర్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు ,పార్టీ సీనియర్ నాయకులు,ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.కాగా గత రెండు వారాలపాటు మంత్రి కేటీఆర్ కొరియా, జపాన్, దావోస్, దుబాయ్ లో పర్యటించిన విషయం తెలిసిందే.