ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వారి వారి పార్టీ పటిష్టతలపై అంచనాలను వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. అదేంటంటే..!! జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో వైఎస్ జగన్ పేరు మారుమోగింది. ఇక అసలు విషయానికొస్తే పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్రలో భాగంగా నిన్న అనంతపురంలో పర్యటించి అక్కడి రైతులను కలుసుకుని మాట్లాడారు. అక్కడి రైతులు పవన్ కల్యాణ్‌తో మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాలుగా పంటలు పండించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వ పెద్దలు చేస్తామని చెప్తారే తప్ప ఇంత వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగుకు నీరు అందక నరకయాతనను అనుభవిస్తున్నామంటూ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.
అనంత రైతుల సమస్యలపై, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్‌రెడ్డి అనేకమార్లు దీక్షలు కూడా చేశారని, మీరు కూడా మాకు అండగా ఉండండి అంటూ పవన్‌ను రైతులు కోరారు. ఇలా వైఎస్ జగన్ పేరు చెప్పగానే అక్కడ ఉన్న యువత ఒక్కసారిగా ఈళలతో పవన్ సభను హోరెత్తించారు. ఏదేమైనా అజ్ఞాతవాసి చిత్రం విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పవనే మా సినీ హీరో.. జగనే మా నాయకుడు అనన పవన్ కల్యాణ్ అభిమానుల బ్యానర్లు వెలసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇలా పవన్ కల్యాణ్ ఉన్న సభలో వైఎస్ జగన్ పేరు మారుమోగడంతో మరోసారి రుజువైంది ఆ విషయం.