ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో.. టీడీపీ మిత్రపక్షం బీజేపీ పుట్టినిల్లు ఆర్ఎస్ఎస్ తేల్చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని బాబు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే డబ్బా రాయుడన్న కామెంట్లు ప్రజల్లో వినిపిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది.
అయితే, దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ మిత్రపక్షాలు 2019 అధికారంలోకి వస్తాయా..? రావా..? వచ్చేందుకు.. రాకపోవడానికి కారణాలేంటి అన్న అంశాలపై ఆర్ఎస్ఎస్ చేసిన సర్వేలో టీడీపీపై ప్రజల నుంచి నివ్వెరపోయే సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఏపీలో అధికారం మారే అవకాశం ఉందని, చంద్రబాబుకు పోటా పోటీ మెజార్టీ సాదించడమే కష్టమని తేల్చింది. అయితే, ప్రస్తుతం ఏపీ మంత్రులపై ఉన్న అవినీతి ఆరోపణలు, మహిళలపై టీడీపీ నేతల దాడులు. అలాగే అగ్రిగోల్డ్ వ్యవహారం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆర్ఎస్ఎస్ సర్వే తేల్చి చెప్పింది. మరి ప్రభుత్వ వ్యతిరేకతను వైసీపీ ఎలా పయోగించుకుంటుందో చూడాలి.