జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇక సోమవారం ఉదయం పుట్టపర్తిలో సత్యసాయి మందిరాన్ని దర్శించుకున్న పవన్ అనంతరం ధర్మవరం చేరుకుని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… గత పది రోజులుగా మాట్లాడి, మాట్లాడి తన గొంతు ఎండిపోయిందని కల్యాణ్ వ్యాఖ్యానించారు. తన గొంతు నుంచి రక్తం వచ్చేంత దగ్గుతున్నానని కూడా పవన్ పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై సెటైర్లు పడుతున్నాయి.
ఒకవైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి రెస్టు లేకుండా మూడు జిల్లాలు కంప్లీట్ చేసుకొని నాల్గో జిల్లాకి చేరుకున్నారు. ఇక జగన్ పాదయాత్ర సోమవారం వెయ్యి కిలో మీటర్లు టచ్ చేశారు.. కాళ్ళకి బొబ్బలు కట్టినా, వెన్నునొప్పి బాధిస్తున్నా, జ్వరం వచ్చి చిరాకుపుట్టించినా.. రోజుకు 14 కిలో మీటర్లు తిరిగి ఎండలో ముఖమంతా దుమ్ముకొట్టుకుపోయినా.. అవేం పట్టించుకోకుండా నిత్యం ప్రజలతో మాట్లాడుతూ, సభల్లో ప్రసంగిస్తూ.. తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అలాంటిది ఈయన నాలుగు రోజులు తిరిగేసరికి గొంతుపోయిందని, రక్తం వస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.. మరి దీంతోనే తెలిసిపోయింది ఎవరు కష్టజీవో.. ఎవరు సుఖజీవో.. రియల్ పాలిటిక్స్ అంటే.. తెరమీద చెప్పే డైలాగ్స్ కాదు మిస్టర్ పవన్… ఇక దుకాణం సర్దుకొని పోయి ఏసీలో పడుకో అంటూ పవన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.