నిత్యం ప్రాజెక్టుల వెంట తిరిగి ,సమీక్షలు జరిపే తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తనకు ఎక్కువగా నచ్చిన పుస్తకం ఏంటో చెప్పారు.నిన్న( ఆదివారం ) ఎన్టీఆర్‌స్టేడియంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ముగింపు సభలో అయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..ఈ రోజుల్లో సెల్‌ఫోన్లు వచ్చాక చేతిగడియారాలు, రేడియోలు, కెమెరాలు పోయాయని, పుస్తకం విలువ మాత్రం తగ్గలేదన్నారు. పుస్తక ప్రదర్శనను 31 జిల్లాలకు విస్తరించాలని మంత్రి పుస్తక ప్రదర్శన సొసైటీ సభ్యులకు సూచించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంచి పుస్తక ప్రియుడని ఈ సందర్బంగా అన్నారు . పుస్తకాలు ముఖ్యమంత్రిని నడిపిస్తే ఆయన మనల్ని నడిపిస్తున్నారని అభివర్ణించారు.నీటిపారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారు. విద్యాసాగర్‌రావు రచించిన ‘‘నీళ్లు-నిజాలు’’ పుస్తకం తనను ఎక్కువగా ప్రభావితం చేసిందన్నారు.‘నీళ్లు-నిజాలు’ పుస్తకం తెలంగాణ సమాజాన్ని నిద్ర లేపిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.