వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఈ నెల 26న జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆమె ప్రసంగించేటప్పుడు పలుమార్లు అకారణంగా నవ్వడంతో పాటు గణాంకాల దగ్గర తడబడ్డారు. మధ్యలో ‘ఇట్స్ ఫన్నీ’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమ్రపాలి చేసిన ప్రసంగం ‘నవ్వులపాలు’ కావడంపై ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్పీ సింగ్ స్పందించారు.ఈ మేరకు ఆయన సోమవారం ఆమ్రపాలితో ఫోన్‌లో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ ప్రసంగం సమయంలో తడబాటుపై ఆరా తీశారు. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని ఆమె సీఎస్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం.కాగా ఆమ్రపాలి ప్రసంగం గత రెండు రోజుల నుండి వైరల్ అయిన విషయం తెలిసిందే.
