తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు ఇటీవలే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన రేవంత్ రెడ్డి కి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
మహాకూటమి కట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ ఉన్నట్టు కనబడుతోందని అన్నారు. ఎన్ని కూటములు కట్టినా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. దమ్ముంటే పరకాలలో ఉత్తమ్ లేదా రేవంత్ రెడ్డి అయినా తనపై పోటీ చేయాలన్నారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాననిఈ సందర్బంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి సవాల్ విసిరారు.పరకాల నియోజకవర్గంలో గత అరువై ఏండ్లలో జరుగని విధంగా రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎక్కడ చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు.