ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన వనదేవతలు సమ్మక్క-సారక్కల జాతరకు మేడారం సిద్ధమైంది.జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం జాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.ఈ క్రమంలో ట్రాన్స్ పోర్ట్ సదుపాయం సరిగా లేని భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు, మణుగూరు వంటి ఏజెన్సీ ప్రాంతాలలో క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలందించడానికి 10 బైక్ అంబులెన్స్ లు కేటాయించింది . మేడారం జాతరకు రంగారెడ్డి, హైదరాబాద్, రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో గాయపడినవారికి సత్వర వైద్య సేవలందించడానికి బైక్ అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చామని, ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఇవి పని చేస్తాయని 108 చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రహ్మానందరావు తెలిపారు.