ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల మీద విశ్లేషణలు, సర్వేల మీద సర్వేలు ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నువ్వా- నేనా అనేలా పోటీ ఉండడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పూర్తి వైఫల్యాలను మూటగట్టుకుంది. దీంతో ప్రజల్లో టీడీపీ పై పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. దీంతో చంద్రబాబు సర్కార్ మళ్లీ అధికారంలోకి రావాలంటే అద్భుతమే చేయాలి. ఇక వైసీపీ విషయానికి వస్తే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలని కళ్లారా చూసి వాటినే అజెండాగా మార్చుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు.
ఇక ఈ నేపధ్యంలో ఏపీ రాజకీయ పరిణామాల పై ప్రముఖ లోకల్ మీడియా- ప్రైవేట్ ఎజెన్సీతో కలిసి సర్వే నిర్వహించగా.. రిజల్ట్ చూస్తే ఏపీ రాజకీయాను హీటెక్కిస్తోంది. ఇక ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే రిజల్ట్ చూస్తే వైసీపీ 120 సీట్లను కైవసం చేసుకోనుందని తేలింది. ముఖ్యంంగా రాయలసీమలో వైసీపీ విపరీతంగా పుంజుకుందని.. సర్వే ఫలితాలు చెప్పుకొచ్చాయి. 2014 ఎన్నికల్లో రాయలసీమలోని 52 సీట్లలో టీడీపీకి 23 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే ఈసారి సీమలో టీడీపీకి గట్టిదెబ్బ తగలడం ఖాయమని.. వైసీపీ వైపే సీమ ప్రజలు నిలువనున్నారని తేల్చేసింది. ఇక ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజక వర్గాల్లో వైసీపీ జెండా ఎగురడం ఖాయమని.. నెల్లూరులో అయితే గత ఎన్నికల రిజల్ట్ లాగే వైసీపీకి తిరుగులేదని ఆ సర్వేలో తేలింది. జగన్ పాదయాత్ర ప్రభావం ప్రజల్లో విపరీతంగా పెరగడంతో.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని .. అయితే గ్రామాల్లో బూత్‌లెవల్ నుంది వైసీపీ కొంత బలోపేతం కావాలని.. ఎన్నికలకు మరి కొంత సమయం ఉండడంతో వైసీపీకి అదేమంత పెద్ద కషయం కాదని ఆ సర్వే తేల్చిచెప్పింది. దోంతో మొన్న బీజేపీ అనుబంధ మీడియా నిర్వహించిన సర్వేలో కూడా దాదాపుగా ఇదే రిజల్ట్ రాగా.. ఇప్పుడు ప్రముఖ లోకల్ మీడియా ప్లస్ ఎజెన్సీ కలిసి చేసిన సర్వేలో కూడా వైసీపీ విజయం ఖాయం కావడంతో టీడీపీ బ్యాచ్ గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.