Home / Uncategorized / రైతుల కోసం..బ్యాంక‌ర్ల‌పై తెలంగాణ స‌ర్కార్ ఆగ్ర‌హం

రైతుల కోసం..బ్యాంక‌ర్ల‌పై తెలంగాణ స‌ర్కార్ ఆగ్ర‌హం

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం అన్ని ర‌కాల సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో మ‌రో ముంద‌డుగు వేసింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో నిర్దేశించిన లక్ష్యం కంటే 12 శాతం తక్కువగా బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చిన ఘటన పునరావృతం కాకుండా జిల్లా స్థాయిలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 12 శాతం జిల్లాల్లో 75 శాతం కంటే తక్కువగా , ఎనిమిది జిల్లాల్లో 100 శాతం కంటే తక్కువగా రైతులకు ఖరీఫ్ సీజన్‌లో రుణాలు ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఈ తరహా ఘటనలు తలెత్తకుండా జిల్ల స్థాయి కన్స‌ల్టేటివ్ కమిటీ ఆఫ్ బ్యాంకర్లు, జిల్లా స్ధాయి సమీక్ష కమిటీల మధ్య సమన్వయం ఉండాలని ప్రభుత్వం భావించింది.ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరింది.

ఈ ఏడాది జూన్ నుంచి ఖరీఫ్ సీజన్‌కు రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాలీనా మూడు సార్లు పైన పేర్కొన్న కమిటీలు సమావేశమై బ్యాంకుల నుంచి రైతులకు అందుతున్న రుణాల తీరును విశే్లషించాల్సి ఉంటుంది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇటీవల నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జిల్లా స్థాయిలో రుణాల పంపిణీపై తగిన నియంత్రణ లేనందు వల్ల, సరైన మార్గనిర్దేశనం లోపించడం వల్ల అసలు లక్ష్యం కంటే 12 శాతం తక్కువగా రుణాలు పంపిణీ అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పంట రుణాల కింద 2017 ఖరీఫ్‌లో రూ.23,851.46 కోట్ల రుణాలు పంపిణీ చేయాలనే లక్ష్యం పెట్టుకుంటే రూ.21,025.90 కోట్లను పంపిణీ చేశారు. దాదాపు రైతులకు రూ.2826 కోట్ల మేర రుణాలను బ్యాంకర్లు అందించలేకపోయారు.

పెద్దపల్లి జిల్లాలో 48శాతం, మేడ్చెల్ మల్కాజగిరి జిల్లాలో 172 శాతం రుణాలు పంపిణీ అయ్యాయి. మంచిర్యాలలో 50 శాతం, వనపర్తిలో 53 శాతం, నిజామాబాద్‌లో 54 శాతం, కొమురం భీం జిల్లాలో 55 శాతం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 56 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 58 శాతం, జోగుళాంబ జిల్లాలో 63 శాతం, జగిత్యాల జిల్లాలో 64 శాతం, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో 72 శాతం రుణాలు పంపిణీ అయ్యాయి. జనగాం, నల్లగొండ, సిద్ధిపేటలో 80 శాతం చొప్పున , వరంగల్ అర్బన్‌లో 85 శాతం మేర రుణాలు పంపిణీ అయ్యాయి. జిల్లా స్థాయి కన్స‌ల్టేటివ్ కమిటీలకు కలెక్టర్లు చైర్‌పర్సన్‌లుగా ఉంటారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలకు ఇన్‌చార్జీ మంత్రులు అధ్యక్షులుగా ఉంటారు. క‌లెక్ట‌ర్ల‌ ద్వారా రుణ పంపిణి మ‌రింత వేగం చేయాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat