విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. ఏపీలో టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలకు అత్యంత విలువైన సమాచారం.వివరాల్లో వెళ్లితే.. స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు సృష్టించారు. సదరు కోటేశ్వర్రావును రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిమరీ సంతకాలు చేయించారు. కబ్జా విషయం తెలిసిన వెంటనే సమరయోధుల కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. సీఐడీ దర్యాప్తులోనూ ఎమ్మెల్యే భూదంతా బట్టబయలైంది. దీంతో కొనుగోలుదారైన బోండా సుజాతపై కేసు నమోదయింది. దీనిపై మరింత పూర్తి సమచారం తెలియాల్సింది.