శృంగారతార షకీలా ‘శీలవతి’ అనే కొత్త చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ‘శీలవతి’ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ”మా హీరోయిన్ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని అన్నారు. ఇందులో షకీలా, గీతాంజలి(ఫ్రూటీ), లడ్డు, అశోక్‌బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్ కరమ్‌తోత్, డైలాగ్స్: యష్ యాదవ్, నిర్మాతలు: రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సాయిరాం దాసరి చేస్తున్నారు.