దేశంలో చాల దారుణంగా అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి.వావి వరుసలు మరచి నీచాతి నీచంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. మరి దారుణంగా కన్న కూతురుపైనే అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలో జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని కొత్తపేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం జరిగింది. మిగతా ఇద్దరు కూతుళ్లు తల్లిదండ్రులతో కలిసి కూలీపనులకు వెళ్తున్నారు.
ఏడాది క్రితం రెండవ కూతురు (17) ప్రేమ వివాహం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె మైనర్ కావడంతో అప్పట్లో పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పటి నుంచి తండ్రి ఆమెపై కన్ను పడింది. లైంగికంగా ఆమెను వేధిస్తూ వస్తున్నాడు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం మూడవ కూతురితో కలిసి భార్య ఓ గదిలో నిద్రిస్తుండగా రెండవ కూతురు మరో గదిలో నిద్రిస్తోంది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన తండ్రి రెండవ కూతురు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విష,యం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు ధైర్యం చేసుకుని రెండవ కూతురు విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లీకూతుళ్లు శుక్రవారం రాత్రి వన్ టౌన్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.