ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నేతలు, భక్త జన సందోహంతో ఆదివారం మేడారం జాతర సందడి, సందడిగా మారింది. ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా నేతలు సమ్మక్క-సారలమ్మలను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.జంపన్నవాగు దగ్గరకు భక్తులు, జిల్లా నేతలతో కలిసి నడిచారు. అనంతరం జంపన్నవాగులో డిప్యూటీ సిఎం నడిచి వెళ్లారు. అనంతరం జిల్లా నేతలకు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. జిల్లా నేతలు, వారి కుటుంబాలంతా కలిసి విందు చేయడం, అందరిని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పేరు,పేరునా పలకరించారు. ఉమ్మడి జిల్లా నేతలే కాకుండా ఎంపీలు విశ్వేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, సీతారాం నాయక్, పసునూరి దయాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీబీ పాటిల్ , ప్రభాకర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పూట రవీందర్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, కొండా మురళి ఎమ్మెల్యే ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, కొండా సురేఖా, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్ గద్దల పద్మ, చైర్మన్లు గుండు సుధారాణి, రాజయ్య యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మేడారంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రిపూట ఏర్పాట్లు, భక్తులకోసం తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అక్కడే రాత్రి బసచేయనున్నారు
Related Articles
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన శుభాకాంక్షలు
November 22, 2022
సీఎం కేసీఆర్ పై అభ్యంతకర పోస్టులు.. సీసీఎస్ లో సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పిర్యాదు
March 24, 2022
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
March 7, 2022
తెలంగాణలో కొత్తగా 41,042 కరోనా కేసులు
February 19, 2022