సమ్మక్క-సారలమ్మ జాతరకు తరలివచ్చే అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం నీరు పరవళ్లు తొక్కుతూ వడివడిగా మేడారంలోని జంపన్న వాగుకు శనివారం ఉదయం నాలుగు గంటలకు చేరింది. భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. జలాల్లో మునిగి పుణ్య స్నానాలు చేస్తూ పులకించిపోయారు. అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ఈత సరదా తీర్చుకుంటూ ఆనందపరవశులయ్యారు. 24న నీటి పారుదలశాఖ ఈఈ నాలం కృష్ణకుమార్, ఏఈ సుధీర్ ఆధ్వర్యంలో నీటిని విడుదల చేశారు.
