తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లాకేంద్రంలోని ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.మైనార్టీ మహిళలకు 500కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.మైనార్టీ పిల్లల చదువు కోసం 206 గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు . రూ.500 కోట్లు మైనార్టీ విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేస్తున్నామని ఈ సందర్బంగా తెలిపారు .మైనార్టీల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.