ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నెల 29వ తేదీన జననేత వైయస్ జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా వైసీపీ చెన్నైలో ‘వాక్ విత్ జగన్ అన్నా’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నైలో నిసిస్తున్న తెలుగు వారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వైయస్ జగనమోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే ..ఆయన కొడుకుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేసి నవరత్నాలు ప్రకటించారన్నారు. ఈ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని, తప్పకుండా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో శరత్ కూమర్ దాసరి, పవన్ వంకీ రెడ్డి,శ్రీదేవి పాల్గొన్నారు.
