ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేప్ జగన్ పాదయాత్రలో వేమిరెడ్డి పాల్గొననున్నారు. వేమిరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దల హామీ వచ్చినట్లు సమాచారం. గతంలో పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(వీపీఆర్) వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ సత్తా చాటడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జిల్లా నేతలను సమన్వయం చేసి పార్టీని జనంలోకి తీసుకెళ్లడంలో చొరవ చూపించారు. అలాగే నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లోను కీలకంగా వ్యవహరించి వైసీపీ నుంచి పలువురిని కార్పోరేటర్లుగా గెలిపించుకోగలిగారు. అంతేగాక వేమిరెడ్డితో పాటు కాంగ్రెస్ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు. మరోవైపు జగన్ పాదయాత్ర 72వ రోజుకు చేరుకుంది. నేడు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గం సంగటూరు నుంచి జగన్ పాదయాత్రను మొదలుపెట్టనున్నారు.
.
Tags ఆంధ్రప్రదేశ్ చేరికలు పాదయాత్ర వైఎస్ జగన్ వైసీపీ