గ్రూప్4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల ప్రక్రియను ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు టీఎస్పీఎస్సీ వేగవంతం చేసింది. సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావుతో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో భేటీ అయ్యారు. దాదాపుగా మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ప్రస్తుతం గ్రూప్ 4 కేటగిరీలో ఎనిమిది వందల ఖాళీలు ఉన్నాయని తెలిపిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మరిన్ని ఖాళీలు ఈ కేటగిరీలో వచ్చేలా చూడాలని ప్రతిపాదించారు. ఆయా విబాగాల నుంచి సమాచారం సేకరించాలన్న ప్రతిపాదనకు సీఎంఓ ముఖ్యకార్యదర్శి అంగీకరించినట్లు తెలుస్తున్నది. కాగా, ఇప్పటివరకు జరిగిన కొలువుల భర్తీ, వాటి పురోగతి వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.