ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలో దళిత సామాజిక వర్గం గురించి చెప్పే మొట్ట మొదటి మాట నేను దళితులకు పెద్దన్నను.ఆ సామాజిక వర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నాను.వారిని అన్ని రంగాల్లో ముందు ఉండేలా అభివృద్ధి చేస్తాను అని ఆయన తెగ ఉదరగోట్టడం మనం చూస్తూనే ఉన్నాం .
అయితే దళితుల పెద్దన్నగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు అదే సామాజిక వర్గానికి దేవుడుగా ఉన్న భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు ఏళ్ళ పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కొంతమంది మహనీయుల సహాయంతో రచించిన భారతరాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అయిన గణతంత్ర దినోత్సోవ వేడుకల్లో పాల్గొనలేదు.అయితే ప్రస్తుత విదేశ పర్యటనల్లో ఉన్న అక్కడ ఎటువంటి అధికారక కార్యక్రమాలు లేకపోయినా కానీ కావాలనే బాబు రాలేదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటుగా ఇటు రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో దళితులకు ఎలా ఉండాలో తెలియదు.శుభ్రత అసలు తెలియదు.ఎలా ఉండాలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నేర్పించారు.ఎవరన్న కావాలని దళిత కులంలో పుట్టాలని కోరుకుంటారా అని వ్యాఖ్యానిస్తూ దళిత సామాజిక వర్గాన్ని ఘోరంగా అవమానించిన చంద్రబాబు అదే సామాజిక వర్గం దేవుడుగా కొలుచుకునే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జరిగే వేడుకలకు ఎలా హాజరవుతాడు అని ఇటు ప్రతిపక్షాలతో పాటుగా రాజకీయ విశ్లేషకులు ,నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.అయితే మొదటి నుండి దళితులు అంటే చులకన భావన ఉన్న చంద్రబాబు తీరును దళితులు ఇకనైనా గుర్తిస్తారో లేదో ..?