ఎన్నో వివాదాలు ..ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విడుదలైన బాలీవుడ్ సినిమా పద్మవాత్ .ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకేక్కించగా దీపికా పదుకునే ,సాహిద్ కపూర్ ,రన్వీర్ సింగ్ ,అదితి రావు ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటు టాలీవుడ్ లో నాలుగు వందల ధియేటర్లలో విడుదల కాగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ధియేటర్లలో విడుదల అయింది.
అయితే గత కొంత కాలంగా కొన్ని హిందు సంస్థలు ,రాజపుత్రులు చేస్తోన్న బందులు ,ఆందోళనలు ఈ మూవీపై ఎటువంటి ప్రభావం చూపించలేదని విడుదలైన మొదటి రోజే వచ్చిన భారీ కలెక్షన్లను బట్టి చెప్పొచ్చు.మొదటి రోజు ఈ మూవీ దాదాపు ఇరవై కోట్ల రూపాయల వసూళ్ళను దక్కించుకుంది అని ఇటు సినీ వర్గాలు అటు ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే మొదటి షో నుండే మూవీ హిట్ అని మౌత్ టాక్ తోపాటుగా రివ్యూ లు కూడా పాజిటివ్ గా రావడంతో మున్ముందు ఈ మూవీ భారీ స్థాయిలో కలేక్షన్లను కొల్లగోడుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి .