పద్మ అవార్డుల ఎంపిక లో కొన్ని రాష్ట్రాల కే పెద్ద పీట వేస్తూ తెలంగాణ సహా పలు రాష్ట్రాలను పట్టించుకోకపోవడం పై టీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ బి .వినోద్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు .పద్మ అవార్డులకు నిర్దేశించిన మార్గదర్శకాలకు దగ్గ ప్రతిభ తెలంగాణ లో చాలా మంది కవులు కళాకారులకు ఉన్నా వారిలో ఒక్కరు కూడా ఆ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు .కొన్ని రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో అవార్డులు లభించి ఇంకొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే అది మంచి సంప్రదాయం అనిపించుకోదన్నారు .రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా వాటిని ఎంపిక కమిటీ పరిగణన లోకి తీసుకోకపోవడం ఆశ్యర్యాన్ని కలిగించిందని వినోద్ అన్నారు .ఇక పై పద్మ అవార్డుల ఎంపిక లో సమ తుల్యత ఉండేలా అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తన లేఖ లో ప్రధానిని కోరారు
