Home / ANDHRAPRADESH / చ‌దువు ఎక్క‌లేదు.. సినిమాలే దిక్క‌య్యాయి..!!

చ‌దువు ఎక్క‌లేదు.. సినిమాలే దిక్క‌య్యాయి..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌లోరే చ‌లోరే చ‌ల్ పేరుతో చేప‌డుతున్న రాజ‌కీయ యాత్ర‌కు సంబంధించి మీడియాకు అంతు చిక్క‌డం లేదు. మీడియాకు ఎటువంటి స్ప‌ష్ట‌మైన స‌మాచారాన్ని సైతం ఇవ్వ‌కుండా జ‌న‌సేన పార్టీ నాయ‌కులు గోప్యంగా ఉంచుతున్నారు.

అయితే, గ‌త వారంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న స‌తీమ‌ని అన్నా, పోలాండ్ అంబాసిడ‌ర్ ఆడ‌మ్ బురాకోవ‌స్కీతో క‌లిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చ‌ర్చిలో ఆదివారం ప్రార్ధ‌న‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ యాత్ర‌పై మీడియాతో మాట్లాడుతూ.. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఒక్క తీరునా సమాధానం చెప్ప‌క‌పోగా.. మీడియాకే ప్ర‌శ్న‌లు త‌లెత్తేలా ప్ర‌సంగించారు. అయితే, మీరు పాద‌యాత్ర చేస్తారా..? లేక రోడ్ షో చేస్తారా..? లేక బ‌స్సు యాత్ర చేస్తారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ ఒక్క తీరునా స‌మాధానం చెప్ప‌లేదు.

అనంత‌రం పోలాండ్ అంబాసిడ‌ర్ ఆడ‌మ్ బురాకోవ‌స్కీతో క‌లిసి నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఓ పోలాండ్ విద్యార్థి అడిగిన ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మాధానం చెబుతూ.. త‌న చిన్న‌ప్పుడు ఉన్న విద్యా ప్ర‌మాణాలు స‌రిగ్గా ఉండేవి కావ‌ని, అందుకే తాను చ‌దువుపై పెద్ద ఇంట్ర‌స్ట్ పెట్ట‌లేద‌న్నారు. 20 ఏళ్లు వ‌చ్చేస‌రికి వెన‌క్కి తిరిగి చూస్తే.. నేను జీవితంలో ఏమ‌వుతానో నాకే తెలీలేద‌న్నారు. అప్ప‌టికే త‌న అన్న చిరంజీవి సినీ ఇండ‌స్ర్టీలో రాణిస్తుండ‌టంతో.. మా అన్నే సినీ ఇండ‌స్ర్టీలోకి రావొచ్చు క‌దా..! అంటూ స‌ల‌హా ఇవ్వ‌డంలో సినీ ఇండ‌స్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ట్లు చెప్పాడు ప‌వ‌న్ కల్యాణ్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat