అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ దమ్మున్న నాయకుడు, మగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక అసలు విషయానికొస్తే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విజయవంతంగా కొనసాగి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనూ విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు వైఎస్ జగన్‌పై ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు చేసిన సర్వేల్లోనూ 2019 ఎన్నికల్లో వైసీపీకే అనుకూల ఫలితాలు వస్తాయని తేల్చి చెప్పాయి.
ఇదిలా ఉండగా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్‌రెడ్డిలా పాదయాత్ర చేయడం ఎవ్వరికి సాధ్యం కాదని, ఏదో రెండు మూడు రోజులు అంటే సరే.. కానీ నెలల తరబడి పాదయాత్ర చేయడం వేరంటూ జగన్‌ను అభినందించారు. తాను కూడా పాతయాత్ర చేయాలని అనుకున్నానని, కానీ అంత సులభం కాదని తెలిసి వెనకడుగు వేశానన్నారు. జగన్‌కు ఉన్న పట్టుదల, మొండితనంతోనే తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారన్నారు. త్వరలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌ను కలిసి అభినందిస్తానని చెప్పారు విష్ణుకుమార్ రాజు. తన మామకు వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టమని, వైఎస్ జగన్‌ను కలిపించాలని తన మామ ఎప్పుడూ కూడా నన్ను అడుగుతుంటాడని మీడియా ముఖంగా చెప్పాడు విష్ణుకుమార్ రాజు. జగన్ తన పాదయాత్రలో భాగంగా వైజాగ్ వస్తే వెంటనే తన మామను తీసుకెళ్లి కల్పిస్తానని చెప్పారు.