రాష్ట్ర విభజనతో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులుఇతర పార్టీల్లో చేరారు కూడాను.
ఇదిలా ఉంచితే.. ఆ విషయం అటుంచితే.. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వైఎస్ జగన్ అంటే తనకు, తన మామకు ఎనలేని ఇష్టమని, తన మామ వైఎస్ జగన్‌ను కలిపించాలని తనను ఎప్పుడు అడుగుతుంటాడని, వైఎస్ జగన్ పాదయాత్ర వైజాగ్‌కు చేరుకోగానే తన మామను జగన్‌తో కలిపిస్తానని చెప్పిన మాటలు విధితమే. అంతేగాక… ఇటీవల కాలంలో మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ కూడా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరువాత జగన్ వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇలా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైఎస్ జగన్‌పై తమకున్న అభిమానాన్ని ఒక్కొక్కరిగా మీడియా సాక్షిగా బయటపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందిన మంత్రి ఆదినారాయణరెడ్డి జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన మంత్రి ఆదినారాయణ రెడ్డి వైఎస్ జగన్ క్రిస్టియన్ కాదని.. కస్టోడియన్ (custodian) అంటూ మీడియా ముఖంగా చెప్పారు. ఇక్కడ కస్టోడియన్ అంటే సంరక్షకుడని అని అర్థం. మరి మంత్రి ఆది నారాయణరెడ్డి custodian అన్న పదానికి అర్థం తెలిసి అన్నారా..? తెలియక అన్నారా..? లేక ఇటీవల కాలంలో జగన్‌కు అనుకూలంగా వస్తున్న సర్వేలను అనుసరించి ఈ మాటలు అన్నారా..? అన్న విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
అయితే, తాజాగా మాజీ మంత్రి కొండ్రు మురళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు అయన అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ మేరకు ప్రకటన చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది. అయితే మొదటగా అయన తెలుగుదేశ పార్టీలో లేదా బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.