ఎల్లప్పుడూ వివాదాస్పదమైన వాఖ్యలు చేస్తూ..మీడియాలో కనిపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో సారి సంచలమైన వాఖ్యలు చేసి మీడియాలో కి ఎక్కారు .వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామలో వ్యవసాయ పంటలపై ఒక ప్రోగ్రాం జరిగింది.అయితే ఆ ప్రోగ్రాం కి మంత్రి దేవినేని హాజరై ప్రసంగిస్తూ..వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట వేశారు.ఆ పంటను పండించకుండా వేరే పంటపై రైతులు ద్రుష్టి పెట్టాలని కీలక వాఖ్యలు చేశారు.అయితే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువమంది రైతులు వరి పంటపై ఆధారపడి వారి జీవనం కొనసాగిస్తుంటారు.అలాంటి వరి పంటపై మంత్రి ఇలాంటి వాఖ్యలు చేయడంవలన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారి తీస్తుంది.