తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బ్రదర్స్ లో ఒకరిగా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.అందుకే నగరంలో పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అనుచవర్గం ఫ్లేక్సీలు పెట్టారు గతంలో .అయితే తాజాగా ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రాజకీయ భవిష్యత్తు గురించి వివరించారు.ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ముఖ్యమంత్రి పదవిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఉపముఖ్యమంత్రి పదవివ్వడమే కాకుండా ఆ సామాజిక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనీ ఆయన కోరారు.
అయితే ప్రస్తుతం పార్టీలో బీసీ సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్నారు.ఇలా అయితే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం అని అన్నారు.తను పార్టీ మారబోతున్నను అని వార్తలు వస్తోన్నాయి.నేను పార్టీ మారతున్నాను అని వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు అని ఆయన అన్నారు.అయితే మొదటిగా పార్టీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్నాయి అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి..