ఎంతో ఉత్సాహంగా బౌలింగ్ చేస్తూ 23 ఏళ్ల ఓ యువకుడు ఒక్కసారిగా ప్రాణాలు విడిచిన సంఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న ( జనవరి 26 ) రాత్రి హైదరాబాద్ సిటీ జహీరానగర్ లో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది.ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న లాయెడ్ ఆంటోనీ అనే యువకుడు బౌలింగ్ చేస్తూ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.సాధారణంగా అందరూ బౌలింగ్ చేస్తూ కింద పడిపోయాడు అనుకున్నారు . కాని వెంటనే లేవలేదు. దీంతో కంగారు పడిన స్నేహితులు అతనికి ఫిట్స్ అనుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.కాగా ఆంటోనీ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో ఊహించని విషాధంలో కుటుంబ సభ్యులు, మిత్రులు షాక్ అయ్యారు.ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కుప్పకూలిన విజువల్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Bowler collapses at tournament at Banjara Hills, dies.
Posted by Ch Sushil Rao on Friday, 26 January 2018