ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై . బీజేపీ తమతో కలసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని ఈరోజు (శనివారం )మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. ‘నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా.. మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి’ ఆయన అన్నారు. అయితే వైసీపీ టికెట్‌పై గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీని రాష్ట్రంలో నామరూపం లేకుండా చేయాలని టీడీపీ చూస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలు చేశారు.
