ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇస్తామని ప్రతిపక్ష నేత జగన్ కొత్తగా అనలేదని వ్యాఖ్యానించారు.జగన్ మాట మీద నిలబడ్డారని, ప్రత్యేక హోదా కోసం ఎమ్.పిలతో రాజీనామా చేయిస్తారని ఆయన అన్నారు.రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ మద్దతు ఇచ్చారని,అప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా అని ఆయన అన్నారు.కేసుల నుంచి బయటపడడానికే జగన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇదొకటి అని ఆయన అన్నారు.ప్రత్యేక హోదాపై ఎన్నోసార్లు మాటలు మార్చిన చంద్రబాబు విపక్ష నేతను తప్పుపడుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.
