ప్రస్తుత ఏపీలోనే కాదు యావత్తు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అబాసుపాలు అయ్యాయి.ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన అతి పెద్ద భారతరాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురష్కరించుకొని దేశ వ్యాప్తంగా జనవరి 26న జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా జరుపుకుంటారు.అయితే ఈ క్రమంలో నిన్న శుక్రవారం జనవరి 26న అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.కానీ నవ్యాంధ్ర రాష్ట్రంలో మాత్రం అబాసుపాలు అయ్యాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.గణతంత్ర వేడుకల్లో మొదటిగా గవర్నర్ లేదా ముఖ్యమంత్రి లేదా మంత్రులు లేదా స్థానిక ఎమ్మెల్యేలు ఆయా చోట్ల జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.దేశ వ్యాప్తంగా ఇలాగె జరిగాయి.
కానీ ఏపీలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా జరిగాయి.సాధారణంగా ముఖ్యమంత్రి అధికారక నివాసంలో ముఖ్యమంత్రి హోదాలో ఎవరుంటే వారు ఎగురవేస్తారు.కానీ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి ,బాబు మనవడు దేవాన్స్ తో కల్సి జాతీయ జెండాను ఎగురవేశారు.అయితే ముఖ్యమంత్రి లేనప్పుడు మంత్రులు లేదా వాళ్ళు లేనప్పుడు కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులు ఎగురవేస్తారు.అయితే ఇటు పార్టీలో కానీ అటు అధికారంలో కానీ ఎటువంటి పదవులు లేని భువనేశ్వరి ఎగురవేయడంపై ప్రధాన ప్రతిపక్ష వైసీపీ నేతలు మండిపడుతున్నారు.ఈ క్రమంలో వారు మాట్లాడుతూ రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి లేనప్పుడు ఉప ముఖ్యమంత్రులు నిమ్మకాయల రాజప్ప, కేఈ కృష్ణమూర్తి ఇద్దరువారెవరైనా ఎగరేయాలి కదా..
ముఖ్యమంత్రిగారి శ్రీమతి, మనుమడు కలిసి ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేయవచ్చునా? ఆమెకు ఆ అధికారం ఉన్నదా? అది కూడా శాసనసభ స్పీకర్, ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప, దేవినేని, కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, సిద్దా రాఘవరావు లాంటి మంత్రుల సమక్షంలో! ఇంతకంటే దారుణం మరేదైనా ఉన్నదా?ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు గారి కుటుంబ ఆస్తి కాదు. ముఖ్యమంత్రి పరోక్షంలో ఆయన విధులను నిర్వహించడానికి తగు ఏర్పాట్లు ఉన్నాయి. ఇటివల ముఖ్యమంత్రి లేనపుడు ఆయన సీటులో ఆయన బావమరిది కూర్చుని మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. ఇది రాజరికం కాదని చంద్రబాబు గ్రహిస్తే మంచిది. ప్రజాస్వామ్యంలో పద్ధతులు, సంప్రదాయాలు పాటించాలి. ఇది
చాలా సీరియస్ విషయంఅని వారు అన్నారు .