ఏపీ టెట్ ( ఉపాధ్యాయ అర్హత పరీక్ష ) మరోసారి వాయిదా పడింది.వచ్చేనెల ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరగాల్సిన ఈ పరీక్షను మరో వారంపాటు వాయిదా వేశారు. దీంతో ఈ పరీక్షను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. టెట్ పరీక్ష తేదీలను ప్రకటించిన తర్వాత వాయిదావేయడం ఇది రెండోసారి.
