టాలీవుడ్ హీరో ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడికెళ్లినా అభిమానులు ఆయను చూడటానికి తరలివస్తున్నారు. అనంతలో కూడా ఇదే మాదిరిగా ఫ్యాన్స్ పవన్ సభకు వచ్చారు. అయితే ఓ అభిమాని పవన్‌ను కలవడం కోసం చేసిన ప్రయత్నంతో అక్కడున్న వారందరు షాక్ అయ్యారు. పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని పవన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. పవన్‌ను గుండెలకు హత్తుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో పోలీసులు షాకయ్యారు. అతనిని పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆ అభిమాని ఒప్పుకోలేదు. పవన్‌తో సెల్ఫీ దిగడానికి ఉత్సాహం చూపాడు. అతని అభిమానానికి ఫిదా అయిన పవన్.. అతనిచ్చిన సెల్‌ఫోన్ తీసుకుని సెల్ఫీ దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.
