ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మంత్రి ఆది నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా టీడీపీ నేత సాయి ప్రతాప్ ఇటీవల వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక డైనమైట్ అని, అందుకే దివంగత నేత వైఎస్ఆర్‌లా జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అంటే తన మామకు ఎంతో ఇష్టమని, వైజాగ్ రాగానే తన మామను వైఎస్ జగన్‌తో కలిపిస్తానని చెప్పారు.
ఇలా అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలు వైఎస్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనూకూల ధోరణి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ మంత్రి వైఎస్ జగన్‌పై తన మనసులోని భావను బయటపెట్టారు. వైఎస్ జగన్ క్రిస్టియన్ కాదని.. కస్టోడియంన్ (custodian) అంటూ మీడియా ముఖంగా చెప్పారు. ఇక్కడ కస్టోడియన్ అంటే సంరక్షకుడని అని అర్థం. మరి మంత్రి ఆది నారాయణరెడ్డి custodian అన్న ఇంగ్లీషు పదనికి అర్థం తెలిసి అన్నారా..? తెలియక అన్నారా..? లే ఇటీవల కాలంలో జగన్‌కు అనుకూలంగా వస్తున్న సర్వేలను అనుసరించి ఈ మాటలు అన్నారా..? అన్న విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.