ఏపీలో రాజకీయాలు అంటే ఒక పార్టీ నుండి వేరే పార్టీలోకి చేరడం ..మరల తిరిగి అదే పార్టీలోకి రావడం అనే విధంగా తయారైంది.అధికార టీడీపీ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై అక్రమకేసులను బనాయించి..బెదిరించొ ..తాయిలాలు ఆశచూపో పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇలా వైసీపీ నుండి టీడీపీలో చేరాడు దివంగత మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రు.నెహ్రు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తన కొడుకు దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తు గురించి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .చేరిన కొంతకాలానికి ఆయన మరణించారు.
అయితే కొడుకు అవినాష్ కి వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయిస్తా అని హమిచ్చిన చంద్రబాబు దేవినేని మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని దూరంగా పెడుతూ వస్తున్నాడు.ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా పనిచేసిన జీఎంసీ బాలయోగి మరణించిన సమయంలో అతని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాను భరోసా ఇచ్చిన చంద్రబాబు ఆతర్వాత ఆ కుటుంబాన్ని గాలికివదిలేశాడు.దీంతో జీఎంసీ బాలయోగి కుటుంబంలో వారసుడైన అతని కుమారుడు ప్రస్తుతం ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు .ప్రస్తుతం దేవినేని వారసుడు అయిన అవినాష్ పరిస్థితి కూడా పార్టీలో దగ్గర దగ్గరగా అలాగే ఉండటంతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే లక్ష్యంతో పార్టీ మారితే మంచిదని దేవినేని అనుచరవర్గం అవినాష్ కి సూచిస్తున్నారు అని జిల్లా రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి.
అప్పట్లో నెహ్రు బ్రతికి ఉన్న సమయంలో తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి తనయుడ్ని బరిలోకి నిలపాలని ఆయన తన అనుచరవర్గానికి చెప్పడమే కాకుండా బాబుకు కూడా చెప్పేవాడు .అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే అక్కడ నుండి పోటి చేస్తారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అవినాష్ కు టికెట్ దక్కడం అంత ఈజీ కాదు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు .ఇప్పటికే జిల్లాలో ముఖ్యంగా బెజవాడ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాబు దగ్గర హామీ తీసుకుంటున్నారు.ఈ క్రమంలో దేవినేని వరసుడుకి సీటు దక్కడం కష్టమని జిల్లా రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి .
కానీ మొదట్లో వైసీపీ నుండి టీడీపీలోకి చేరి ..ఆ తర్వాత వైసీపీలో చేరిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాల ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చాడు జగన్ .ప్రస్తుతం ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న వైసీపీలోకి చేరితే అవినాష్ కి జగన్ మంచి ప్రాధాన్యత కల్పించడం ఖాయం ..పార్టీలో ఉండి ఎన్నో అవమానాలకు గురయ్యే బదులు పార్టీ మారడమే శరణం అని దేవినేని అనుచరవర్గం అవినాష్ కు వివరించారు.అయితే పాదయాత్రలో భాగంగా త్వరలో కృష్ణ జిల్లాకు జగన్ రానున్న నేపథ్యంలో ఆలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం.చూడాలి మరి మంచి రాజకీయ అనుభవం ఉన్న కుటుంబంలో ఉన్న యువనేత అయిన అవినాష్ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ..?