తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ వేడుకలకు హజరయ్యారు.హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నాయి ని మాట్లాడుతూ.. అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోని 29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా తాగునీరు, నూతన ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు త్వరలోనే అందిస్తామన్నారు.