మరో అత్యంత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదిక అవుతుంది. ఈ నెల ( జనవరి ) 27 నుండి 31 వరకు జీవకణ శాస్త్రం-18 సదస్సు హైదరాబాద్ లో జరగుతుంది. మొదటిసారిగా ఈ సదస్సుకి భారత్ ఆతిధ్యం ఇస్తుంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ సెల్ బయాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ, ఏసియన్ ఫసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ(ఏపీఓసీబీ)లు కలసి సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. 30 దేశాల నుండి 300 సంస్ధల నుంచి సైంటిస్ట్ లు, రీసెర్చర్లు, స్కాలర్లు, ఇందులో పాల్గొంటారు. 1200 మంది విధ్యార్ధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి ఈ సదస్సుకి హాజరవుతారని సదస్సు నిర్వాహకులు తెలిపారు.శామీర్ పేటలోని లియోనియా రిసార్ట్ లో ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది.
