టాలీవుడ్ హీరో నాని కారుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం నాని కారు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 3/పీపీడీఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
