ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జవనరి 26న విడుదల చేయనున్న జీఎస్టీ మూవీ ఆగిపోయింది.మీరు చదివింది నిజమే.రాంగోపాల్ వర్మ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాను అని ప్రకటించిన జీఎస్టీ లఘుచిత్రం విడుదల నిలిచిపోయింది.మొదటి నుండి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జీఎస్టీ తాజాగా విడుదలను నోచుకోలేదు.
అయితే వర్మ తీసిన ఈ లఘు చిత్రం మీద ఎన్నో లక్షల మంది అత్రుతతో ఎదురుచూస్తున్నా తరుణంలో ట్రాపిక్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో కొన్ని సాంకేతక సమస్యల వలన వీడియో అప్ లోడ్ అవ్వడం ఆలస్యమవుతుంది.మరికొద్ది సేపట్లో అప్ లోడ్ చేస్తామని వర్మ ట్విట్టర్ లో తెలిపారు .