ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ తో కలసి నడుస్తున్నారు. ఆ పాదయాత్ర విజయవంతంతగా జరుగుతున్నది. అంతేకాదు చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ జగన్ తన పాదయాత్రను చేస్తున్నారు. జగన్‌లో వచ్చిన రాజకీయ పరిణితిని గమనించిన రాజకీయ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసిన పలువురు సీనియర్ నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత టీడీపీ నేత సాయిప్రతాప్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రపై పొగడ్తల వర్షం కురిపించారు. జగన్ మోహన్‌రెడ్డి ఓ డైనమైట్ అని, ఏ నాయకుడు చేయని విధంగా జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలు విన్న పలువురు టీడీపీ నాయకులు సాయి ప్రతాప్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, అందులో భాగంగానే ఇలా జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని చర్చించుకుంటున్నారు.అసలైతే, సాయి ప్రతాప్ ఎప్పుడో వైసీపీలో చేరాల్సింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు బాగా సన్నిహితుడైన సాయి వివిధ కారణాల వల్ల జగన్ కు దూరమై టిడిపిలో చేరారు. సాయిప్రతాప్ త్వరలో వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం మాత్రం జోరుగా మొదలైంది.